Pradhan Mantri Shram Yogi Maan Dhan Yojana,Govt Scheme: నెలకు రూ.55 కడితే చాలు.. జీవితాంతం రూ.3000 పెన్షన్.. ఈ ప్రభుత్వ పథకానికి ఎవరు అర్హులంటే? – rs 55 month-to-month funding in pm sym scheme can fetch rs 3000 pension who’s eligible beneath this govt scheme

Pradhan Mantri Shram Yogi Maan Dhan Yojana,Govt Scheme: నెలకు రూ.55 కడితే చాలు.. జీవితాంతం రూ.3000 పెన్షన్.. ఈ ప్రభుత్వ పథకానికి ఎవరు అర్హులంటే? – rs 55 month-to-month funding in pm sym scheme can fetch rs 3000 pension who’s eligible beneath this govt scheme

Govt Pension Scheme: నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే జీవితాంతం నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ పొందే అద్భుతమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అదే పీఎం ఎస్‌వైఎం స్కీమ్. అసంఘటిత రంగంలోని కార్మికులకు ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. తాజాగా ఈ స్కీమ్‌పై పార్లమెంటులో కేంద్ర కార్మిక శాఖ ప్రకటన చేసింది. మరి ఏ వయసు వారు ఎంత చెల్లిస్తే ఎంత మేర పెన్షన్ పొందవచ్చు అనే వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

PM SYM
PM SYM(ఫోటోలు– THE ECONOMIC TIMES)
Govt Pension Scheme : మీరు అసంఘటిత రంగంలో పని చేస్తున్నారా? ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఉద్యోగుల మాదిరిగా మీకు ఎలాంటి సామాజిక భద్రత లేదని ఆందోళన చెందుతున్నారా? అయితే, అలాంటి ఆందోళన అవసరం లేదు. మీరు కూడా పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల మాదిరిగా నెల నెలా పెన్షన్ పొందవచ్చు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. అదే ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన (PM SYM). 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత గ్యారెంటిగా నెలకు రూ.3000 పెన్షన్ పొందవచ్చు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. భవన నిర్మాణ పనులు, వ్యవసాయ కూలీల వంటి వారికి ఈపీఎఫ్, ఎన్‌పీఎస్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ యాక్సెస్ ఉండుది. అలాంటి లక్షల మంది కార్మికులకు ఈ పెన్షన్ అందించేందుకు కేంద్రం ఈ పథకాన్ని లాంచ్ చేసింది.

రూ.3000 పెన్షన్ ఎలా వస్తుంది?

ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ స్కీమ్ అనేది ఒక వాలంటరీ, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. వీధి వ్యాపారులు, నిర్మాణ రంగ కార్మికులు, ఇళ్లల్లో పని చేసే వారు, చిరు వ్యాపారుల వంటి అసంఘటిత రంగాల్లో పని చేసే వారి కోసం ఈ పెన్షన్ పథకాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లేజ్ ఇటీవలే ఈ స్కీమ్‌పై పార్లమెంటులో కీలక విషయాలు వెల్లడించారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నెలకు రూ.3000 పెన్షన్ అందుతుందని స్పష్టం చేశారు. ఈ స్కీమ్ సులభమైన నియమం పై ఆధారపడి పని చేస్తుంది. ప్రతి నెలా ఈ పథకానికి కొంత పొదుపు చేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో చేరాలనుకునే వారి వయసు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి. నెలవారీ ఆదాయం రూ.15 వేలలోపు ఉండాలి. అసంఘటిత రంగాల్లో పని చేస్తూ ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ లేదా ఎన్‌పీఎస్‌లో చేరకూడదు. ఈ పథకంలో ఎంత డిపాజిట్ చేయాలి అనేది వయసు బట్టి మారుతుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయసు వ్యక్తి చేరితే నెలకు రూ.55 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇక 40 ఏళ్ల వ్యక్తి చేరితే రూ.200 కట్టాల్సి వస్తుంది. దీనికి సమానంగా ప్రతి నెలా కేంద్రం చెల్లిస్తుంది. అంటే ఈ స్కీమ్‌లో చేరే వ్యక్తి సగం మాత్రమే చెల్లిస్తున్నట్లు అవుతుంది.
ఈ పథకంలో చేరాలనుకునే వారుక సమీపంలోని కామన్ సర్వీసె సెంటర్‌కి వెళ్లాలి. ప్రస్తుతం దేశంలో 4 లక్షల వరకు సీఎస్‌సీ కేంద్రాలు ఉన్నాయి. లేదా మాన్ ధన్ పోర్టల్ ద్వారా సొంతంగా ఎన్‌రోల్ చేసుకోవచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం పీఎం ఎస్‌వైఎం స్కీమ్‌లో మార్చి 12, 2026 వరకు 52.5 లక్షల మంది లబ్ధిదారులు చేరారు. అంటే ఈ స్కీమ్‌పై ప్రజల్లో అవగాహన వస్తోంది. పెద్ద సంఖ్యలో అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకంలో చేరుతున్నారు.

బండ తిరుపతి

రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్‌ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. బండ తిరుపతి 2025 ఫిబ్రవరి‌లో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఓవర్ అచీవర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నారు.

తిరుపతి మండలస్థాయి న్యూస్ కంట్రిబ్యూటర్‌గా తన జర్నలిజం కెరీర్‌ను ప్రారంభించారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. సినిమాలు, క్రికెట్ చూడటం, బిజినెస్ రంగానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆయన ఆసక్తి చూపుతారు.… ఇంకా చదవండి