Noida: పక్క కార్లలోని మహిళలకు ఆకతాయిల ఫ్లయింగ్‌ కిస్‌లు..

ఇంటర్నెట్‌డెస్క్: తమ పక్కన కార్లలో వెళ్తున్న మహిళలను వేధించిన ఆకతాయిలు అడ్డంగా బుక్‌ అయ్యారు. ఆ వీడియో వైరల్ కావడంతో జైలుపాలయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా (Noida)లో నడిరోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ వీడియోలో రెడ్ కలర్ కారులో వెళ్తున్న ఓ వ్యక్తి తమపక్క కారులో ఉన్న మహిళ పైకి ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చినట్లు సైగ చేశాడు. అక్కడితో ఆగకుండా అసభ్య సంజ్ఞలు చేశాడు. వెనక సీట్లో కూర్చొన్న మరో వ్యక్తి నవ్వుతూ కనిపించాడు. ఈ వ్యవహారం మొత్తం రికార్డయింది. వీడియో రికార్డు అవుతుందని తెలిసినా కూడా వారు అలాగే ప్రవర్తించడం గమనార్హం. ‘‘అతడు మద్యం తాగి ఉన్నాడు. మేం మా కుటుంబంతో కలిసి వెళ్తున్నాం. మా కారులో ఉన్న మహిళపై అతడు అసభ్యంగా ప్రవర్తించాడు’’ అని వీడియో తీసిన వ్యక్తి ఆగ్రహం వ్యక్తంచేశాడు. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. ఇదంతా వైరల్ కావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

ఈ నిందితులు ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళలతోనూ అలాగే ప్రవర్తించారు. దాంతో వారు భయాందోళనకు గురయ్యారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలపై వారికి ఏమాత్రం గౌరవం లేదని, నలుగురిలో ఉన్నామన్న కనీస విజ్ఞత కూడా లేదని మండిపడ్డారు. 

Online Maharashtra
Logo
Compare items
  • Total (0)
Compare
0
Shopping cart