
ఇంటర్నెట్ డెస్క్: తమ జట్టు ఎక్కువగా డేటా విశ్లేషణపైనే ఆధారపడి ఉందని ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచ కప్‌లో టీమ్‌ఇండియాతో వాంఖడే వేదికగా సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తలపడనుంది. ఈ సందర్భంగా కెప్టెన్ బ్రూక్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. స్పిన్‌ను ఎదుర్కోవడంలో తమకు గొప్ప రికార్డు లేదని అంగీకరించాడు. తమ వద్ద ఉన్న డేటాతో భారత్‌ను ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించాడు.
‘‘మా దగ్గర చాలా గణాంకాలు ఉన్నాయి. వీడియోల రూపంలోనూ చాలా స్టఫ్ ఉంది. భారత బ్యాటర్లు ఎక్కడ బంతిని విసిరితే భారీ షాట్లు కొడతారు? ఎలాంటి బౌలింగ్ చేయాలనేదానిపై కసరత్తు చేశాం. టీమ్ఇండియా బలమైన టీమ్. కానీ, మా పని మాత్రం వారిని ఇరుకున పెట్టి విజయం సాధించేందుకు ప్రయత్నించడమే. జోస్ బట్లర్ తప్పకుండా మళ్లీ ఫామ్ అందుకొంటాడని భావిస్తున్నాం. ఫిల్ సాల్ట్‌తో కలిసి భారత బౌలింగ్‌పై ఆధిపత్యం ప్రయత్నిస్తాడనే నమ్మకం ఉంది. అయితే, టీమ్‌ఇండియాలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వారిని ఎదుర్కొని పరుగులు రాబట్టడం మాకు సవాలే. వరుణ్ చక్రవర్తి ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్. స్పిన్‌ను ఆడటంలో మాకు మంచి రికార్డు లేదు. వరుణ్ బౌలింగ్‌లో పరుగులు చాలా కష్టం’’ అని బ్రూక్ తెలిపాడు.