Thursday, March 12, 2026
HomeTechnologyBharta Mahashayulaku Vignapthi Ott Release,నిరీక్షణ ముగిసింది.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ అఫిషియల్ డేట్...

Bharta Mahashayulaku Vignapthi Ott Release,నిరీక్షణ ముగిసింది.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ అఫిషియల్ డేట్ ఇదే! – ravi teja bharta mahashayulaku wignapthi set for ott launch on zee5

మాస్ మహారాజా రవితేజ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ త్వరలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఈ చిత్రం మార్చి 13, 2026 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Bhartha Mahasayulaku Wignapthi OTT Release Date Announced
Bhartha Mahasayulaku Wignapthi OTT Release Date Announced(ఫోటోలు– Samayam Telugu)
మాస్ మహారాజ్ రవితేజ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ భర్త మహాశయులకు విజ్ఞప్తి ’ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా, ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రవితేజ కామెడీ టైమింగ్‌, ఇద్దరు హీరోయిన్లతో ఆయన చేసే రొమాంటిక్ సన్నివేశాలు చూడాలని అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ కాగా.. నాలుగు సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసినప్పటికీ, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మాత్రం ఆలస్యంగా స్ట్రీమింగ్‌కు వస్తోంది. సినిమా విడుదలై దాదాపు రెండు నెలలు కావస్తున్నప్పటికీ ఓటీటీ డేట్ ప్రకటించకపోవడంతో అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఆ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5) ఈ చిత్ర స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది.

* ఒక్కొక్కరు ఒక్కో చోట… విడాకుల ఇష్యూతో విజయ్ ఫ్యామిలీ చిన్నాభిన్నం!

జీ5 విడుదల చేసిన ప్రకటన ప్రకారం మార్చి 13 నుంచి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఓటీటీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. “నిరీక్షణ ముగిసింది… భర్త మహాశయులకు విజ్ఞప్తి మార్చి 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్” అనే సందేశంతో చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంక్రాంతి తర్వాత ఇంత ఆలస్యంగా ఓటీటీకి వస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుంది అన్న ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా, నిర్మాతగా సుధాకర్ చెరుకూరి వ్యవహరించారు. సినిమాలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్ , డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. అలాగే సునీల్, సత్య కీలక పాత్రల్లో కనిపించారు.
* పెళ్లి తర్వాత స్పీడ్ పెంచిన విజయ్ దేవరకొండ.. మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్!

కథ విషయానికి వస్తే, ఈ చిత్రం ఒక భర్త జీవితం చుట్టూ తిరుగుతుంది. వ్యాపార ఒప్పందం కోసం స్పెయిన్‌కు వెళ్లిన హీరో అక్కడ ఒక మహిళతో పరిచయం పెంచుకుంటాడు. అయితే అదే సమయంలో అతని భార్య చాలా పొసెసివ్ స్వభావం కలిగిన వ్యక్తి. ఈ ఇద్దరి మధ్య చిక్కుకుపోయిన హీరో పరిస్థితులు, అతడు ఎదుర్కొనే సమస్యలు, వాటి నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలే ఈ కథలో ప్రధానాంశం. భార్య – ప్రియురాలు మధ్య నలిగే భర్త పరిస్థితిని హాస్యభరితంగా చూపిస్తూ కథను ముందుకు నడిపించారు. రవితేజ కామెడీ, రొమాన్స్, వినోదం మేళవించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

వీరేష్ బిళ్ళ

రచయిత గురించివీరేష్ బిళ్ళవీరేశ్ బిల్లా సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, పొలిటికల్ న్యూస్, క్రికెట్ వార్తలు రాశారు. ఆయనకు హైపర్ లోకల్ న్యూస్ రాసిన అనుభవంతోపాటు వీడియో టీమ్ కోసం పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆయనకు జర్నలిజంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు. వీరేశ్ ఈజేఎస్‌ నుంచి వెబ్ జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు.… ఇంకా చదవండి