Friday, March 20, 2026
HomeSportChiranjeevi: ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు అందుకున్న చిరంజీవి.. సందడిగా ప్రదానోత్సవం

Chiranjeevi: ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు అందుకున్న చిరంజీవి.. సందడిగా ప్రదానోత్సవం

హైదరాబాద్‌: తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్ అవార్డుల్లో నటుడు చిరంజీవి (Chiranjeevi).. ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే. గురువారం నిర్వహించిన ప్రదానోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘విజేతలకు అభినందలు తెలియజేస్తున్నా. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. కళాకారులు ఉన్న చోట సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. ఈ అవార్డులు అందజేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని పేర్కొన్నారు.

పైడి జయరాజ్‌ పురస్కారాన్ని కమల్‌ హాసన్‌, నాగిరెడ్డి చక్రపాణి అవార్డును నిర్మాత అశ్వనీతద్‌, కె.ఎల్‌. కాంతారావు ఫిల్మ్‌ అవార్డును ఆర్‌. నారాయణ మూర్తి, సి.నారాయణరెడ్డి ఫిల్మ్‌ అవార్డును సుద్దాల అశోక్‌తేజ, అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్‌ అవార్డును జయసుధ స్వీకరించారు. బీఎన్‌రెడ్డి ఫిల్మ్‌ అవార్డును దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తరఫున (ఈవెంట్‌కు ఆయన హాజరుకాకపోవడంతో) కమల్‌ హాసన్‌ అందుకున్నారు. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్‌), ఉత్తమ నటిగా రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్‌), ఉత్తమ దర్శకుడిగా సాయిలు (రాజు వెడ్స్‌ రాంబాయి) తదితరులు సీఎం నుంచి అవార్డులు అందుకున్నారు. ఈ వేడుకలో పలువురు టాలీవుడ్‌ ప్రముఖులతోపాటు రితేశ్‌ దేశ్‌ముఖ్‌- జెనీలియా దంపతులు, మాధురీ దీక్షిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Suhas
Suhashttps://onlinemaharashtra.com/
Suhas Bhokare is a journalist covering News for https://onlinemaharashtra.com/
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments