
హైదరాబాద్: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ చిత్రం ఉగాది సందర్భంగా ఈ నెల 19న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నైజాంలో ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణలో గురువారం ఉదయం 7:30కే షో పడనుంది. ఇప్పటికైతే టికెట్ ధరల పెంపు లేదు. రెగ్యులర్ రేట్లకే టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
గురువారం తెల్లవారుజామున (4గంటల తర్వాత) బెనిఫిట్ షో ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని టికెట్ ధరను రూ.500 (పన్నులతో కలిపి)గా నిర్ణయించారు. అలాగే సినిమా విడుదల నాటి నుంచి పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున పెంచుకునే అవకాశమిచ్చింది.