
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ కలిగిన మల్టీప్లెక్స్‌గా రూపొందింది ‘అల్లు సినిమాస్’ (Allu Cinemas). తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించనున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో అతిథిగా హాజరుకానున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక (allu cinemas opening ceremony) ప్రారంభం కానుంది.
నేడు లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ మల్టీప్లెక్స్‌లో.. ఉగాది సందర్భంగా ఈ నెల 19 నుంచి సినిమాలు ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఇందులో నాలుగు స్క్రీన్లు ఉండగా.. స్క్రీన్ 1లో డాల్బీ విజన్ ఉంది. శుక్రవారం (మార్చి 13) నుంచి ‘బుక్ మై షో’ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నట్లు ‘అల్లు సినిమాస్’ ప్రకటించింది. ఇందులో తొలుత.. ‘ధురంధర్ 2’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమాలు సందడి చేయనున్నట్లు తెలిసింది.