Sunday, March 15, 2026
HomeBusinessపొట్టి కప్పులో రికార్డుల హోరు | basic

పొట్టి కప్పులో రికార్డుల హోరు | basic

దిల్లీ: పొట్టి క్రికెట్లో ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌ వీక్షణల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించినట్లు ఐసీసీ ఛైర్మన్‌ జై షా ప్రకటించాడు. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీని వీక్షించిన వారి సంఖ్య ఏకంగా 50 కోట్ల మైలురాయిని దాటిందని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇదే అత్యధికమని చెప్పాడు. ‘‘2026 టీ20 వరల్డ్‌కప్‌ను ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందే క్రికెట్‌ సంబరంగా మార్చాలనే లక్ష్యంతో ప్రయాణాన్ని మొదలుపెట్టాం. భారత్‌లో ఈ టోర్నీ వీక్షకుల సంఖ్య 50 కోట్లు దాటడం గొప్పగా అనిపిస్తోంది. అభిమానులు చూపిస్తున్న ఎనలేని ప్రేమాభిమానాల వల్లే ఈ ఘనత సాధ్యమైంది. ముఖ్యంగా డిజిటల్‌ వేదిక ‘జియో హాట్‌స్టార్‌’లో అత్యధికంగా ఒకేసారి 6.05 కోట్ల మంది మ్యాచ్‌ను వీక్షించి సరికొత్త రికార్డు నెలకొల్పడం ఎంతో ఆనందాన్నిస్తోంది. భారత అభిమానుల ఆదరణతో నాకౌట్‌ మ్యాచ్‌ల్లో మరిన్ని రికార్డులు బద్దలవుతాయని ఆశిస్తున్నా’’ అని జై షా పేర్కొన్నాడు.

Suhas
Suhashttps://onlinemaharashtra.com/
Suhas Bhokare is a journalist covering News for https://onlinemaharashtra.com/
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments