Tuesday, March 17, 2026
HomeBusinessMohammad Nawaz: పాకిస్తాన్ దొంగాట‌..ఇంగ్లాండ్ ప్లేయ‌ర్లు ర‌న్స్

Mohammad Nawaz: పాకిస్తాన్ దొంగాట‌..ఇంగ్లాండ్ ప్లేయ‌ర్లు ర‌న్స్

Mohammad Nawaz: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( ICC Men’s T20 World Cup 2026)  భాగంగా ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే సగం మ్యాచులు పూర్తయ్యాయి. ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ కు కూడా వెళ్ళింది. ఇక సూపర్ 8 లో భాగంగా మంగళవారం రోజున పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Pakistan ) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పైన రెండు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. అయితే చేజింగ్ సమయంలో ఇంగ్లాండ్ కాస్త తడబడింది. చివరలో వరసగా వికెట్లను కూడా కోల్పోయింది ఇంగ్లాండ్.

అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ నవాజ్ ( Mohammad Nawaz ) కుట్రకు తెర లేపాడు. ఇంగ్లాండ్ ప్లేయర్ పరుగు తీయకుండా ఆపే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆఫ్ఘనిస్తాన్ కు ( Afghanistan) సంబంధించిన నెటిజన్స్ ఈ ఫోటోలను బయటపెట్టి దారుణంగా ఆడుకుంటున్నారు. పాకిస్తాన్ ( Pakistan ) అంటేనే దొంగాట అంటూ ఫైర్ అవుతున్నారు. గెలవడానికి ఎలాంటి కుట్రలకైనా పాకిస్తాన్ ( Pak ) పాల్పడుతుందని మండిపడుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ నెటిజెన్స్. దీంతో మహమ్మద్ నవాజ్ చేసిన పని వైరల్ గా మారింది.

Also Read:  Indian Team Semi final Qualification: టీమిండియా సెమీ ఫైన‌ల్ కు చేరాలంటే ఒక్క‌టే మార్గం..వ‌ర్షం ప‌డాల‌ని కొబ్బ‌రికాయ‌లు కొట్టాల్సిందే

పాకిస్తాన్ సెమీఫైనల్ ఆశలు గల్లంతు అయినట్లే ?

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు ( ICC Men’s T20 World Cup 2026)   నేపథ్యంలో పాకిస్తాన్ సెమీఫైనల్ ఆశలు దాదాపు గల్లంతు అయినట్లే తెలుస్తోంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్తాన్ ఖాతాలోకి ఒక పాయింట్ వచ్చింది. ఇక ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో చిత్తుగా ఓడింది పాకిస్తాన్. ఈ దెబ్బకు పాకిస్తాన్ సెమీఫైనల్ వెళ్లడం కష్టమే అని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ సెమీ ఫైనల్ వెళ్లడం అసాధ్యం అంటున్నారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో సెమీ ఫైన‌ల్స్ లోకి పాకిస్తాన్ ఎంట్రీ ఇవ్వాలంటే, న్యూజిలాండ్ వ‌రుస‌గా రెండు మ్యాచ్ ల‌లో ఓడిపోవాలి. అటు శ్రీలంక‌పై పాకిస్తాన్ భారీ విజ‌యం నమోదు చేసుకోవాలి. ఈ రెండు జ‌రుగ‌డం అసాధ్య‌మే అంటున్నారు. అంటే ఈ లెక్క‌న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ అవుతుంద‌ని అంటున్నారు.

పాకిస్తాన్ కెప్టెన్ స‌ల్మాన్ భార్య‌కు వేధింపులు

పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యే ప్ర‌మాదం పొంచి ఉన్న త‌రుణంలో కెప్టెన్ స‌ల్మాన్ భార్య‌ను వేధిస్తున్నారు. స‌ల్మాన్ భార్య‌ను రేప్ చేస్తామ‌ని, ఆయ‌న కొడుకును చంపేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు పాక్ ఫ్యాన్స్‌. అయితే, త‌మ ఫ్యామిలీని తిడితే, పాకిస్తాన్ కు టైటిల్స్ రాబోవ‌ని కౌంట‌ర్ ఇస్తున్నారు స‌ల్మాన్ భార్య‌.

Also Read: England vs Pakistan: సెంచ‌రీతో ఇర‌గదీసిన బ్రూక్‌, సెమీ ఫైన‌ల్ కు ఇంగ్లాండ్‌..టోర్న‌మెంట్ నుంచి పాకిస్తాన్ ఔట్ !

 

Suhas
Suhashttps://onlinemaharashtra.com/
Suhas Bhokare is a journalist covering News for https://onlinemaharashtra.com/
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments