
ఇంటర్నెట్ డెస్క్: శ్రీవిష్ణు హీరోగా యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో రానున్న చిత్రం ‘విష్ణు విన్యాసం’. ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను చిత్రబృందం వెల్లడించింది. అతి తక్కువ రన్‌టైమ్‌లో ఇది రానున్నట్లు ప్రకటించింది. కేవలం 1.59 గంటల నిడివితో ఇది రానుంది. ‘తక్కువ రన్‌టైమ్.. ఎక్కువ నవ్వులు.. మరింత వినోదం’ అని పోస్టర్ షేర్ చేసింది. దీనికి సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కామెడీ డ్రామాలో (Vishnu Vinyasam) నయన్ సారిక నటించారు.
విడుదల నేపథ్యంలో తాజాగా జరిగిన విలేకర్ల సమావేశంలో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తంచేశారు. ‘‘చాలా రోజులు గుర్తుండిపోయే చిత్రమిది. ప్రథమార్ధం యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. ద్వితీయార్ధం మంచి ఫ్యామిలీ డ్రామాగా మారుతుంది. సినిమా పూర్తయ్యేసరికి ఓ మంచి చిత్రం చూసిన అనుభూతి కలుగుతుంది. ఇది కచ్చితంగా సూపర్ హిట్ సినిమా’’ అన్నారు.