Wednesday, February 25, 2026
HomeTechnologyIndia vs Pakistan: జూన్‌ 14న భారత్‌.. పాకిస్థాన్‌ ఢీ..

India vs Pakistan: జూన్‌ 14న భారత్‌.. పాకిస్థాన్‌ ఢీ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ వేదికగా జూన్‌ 12 నుంచి మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ (ICC Womens T20 World Cup) 2026  ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) విడుదల చేసింది. ఈ మెగాటోర్నీ ఇంగ్లాండ్‌, శ్రీలంక మధ్య మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. భారత్‌ తన మొదటి మ్యాచ్‌ను పాక్‌తో జూన్‌ 14న ఆడనుంది. ఫైనల్‌ మ్యాచ్‌ జులై 5న లార్డ్స్‌లో జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొనున్నాయి. 

మొత్తం రెండు గ్రూపులుగా జట్లు తలపడనున్నాయి. గ్రూప్‌ 1లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌, గ్రూప్‌ 2లో వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ పోటీ పడనున్నాయి. 

Suhas
Suhashttps://onlinemaharashtra.com/
Suhas Bhokare is a journalist covering News for https://onlinemaharashtra.com/
RELATED ARTICLES

Most Popular

Recent Comments

Tutorial de trading en gate.io on Insurance Agency Lead Scoring