Thursday, March 19, 2026
HomeSportపిడుగుపాట్లు.. ఆకస్మిక వర్షాలు | common

పిడుగుపాట్లు.. ఆకస్మిక వర్షాలు | common

ఈనాడు, విశాఖపట్నం: ఓ వైపు ఎండలు, మరోవైపు ఆకస్మిక వర్షాలతో రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. కొద్దిరోజులు రాష్ట్రంలో ఇదే తరహా వాతావరణం కొనసాగే అవకాశముంది. ద్రోణి, ఆగ్నేయ, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. పిడుగులతోపాటు గంటకు గరిష్ఠంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని తెలిపింది. కోస్తా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గుతాయని అంచనా వేస్తోంది. ఆకస్మిక వర్షాలు, పిడుగుపాట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిల్చోరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ సూచించారు. బుధవారం అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసింది.

Suhas
Suhashttps://onlinemaharashtra.com/
Suhas Bhokare is a journalist covering News for https://onlinemaharashtra.com/
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments