ABN
, Publish Date – Mar 21 , 2026 | 12:09 AM
Ready to RamaZan celebrations
పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. శనివారం రంజాన్ పండుగను జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు.

జామియా మసీదులో విందు చేస్తున్న ముస్లింలు
ముగిసిన ఉపవాస దీక్షలు
అరసవల్లి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. శనివారం రంజాన్ పండుగను జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. జిల్లాలోని అన్ని మసీదులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. శ్రీకాకుళంలోని జామియా మసీదులో శుక్రవారం సాయంత్రం ముస్లింలు పెద్దఎత్తున విందులో పాల్గొన్నారు. శనివారం ఈ మసీదులో నమాజ్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ముస్లింలు తక్బీర్ చదువుతారు. అనంతరం ఇమామ్‌లు ప్రత్యేక సందేశం ఇస్తారు. మసీదుల వద్ద ఒకరికొకరు ఈద్‌ముబారక్ చెప్పుకోనున్నారు.
Updated Date – Mar 21 , 2026 | 12:09 AM