తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్… రైతు భరోసా నిధులు విడుదల, రేపు అకౌంట్లలో డబ్బులు జమ | cm revanth reddy launch rythu bharosa funds first section these farmers will get cash

తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్… రైతు భరోసా నిధులు విడుదల, రేపు అకౌంట్లలో డబ్బులు జమ | cm revanth reddy launch rythu bharosa funds first section these farmers will get cash

తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్ రైతు భరోసా నిధులు విడుదల రేపు అకౌంట్లలో డబ్బులు జమ

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్… యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రోజున రైతు భరోసా నిధుల విడుదలను ప్రారంభించారు. మొత్తం మూడు విడతల్లో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తొలి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా సాయం అందించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించారు. దీంతో పాటు రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ‘‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ వేదికపై నుంచి సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా విడుదలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రైతు భరోసా నిధులను ఈరోజు విడుదల చేసినట్టుగా చెప్పారు. తొలి విడతలో ఈరోజు దాదాపు రూ. 3,600 కోట్ల మొత్తాన్ని 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసినట్టుగా తెలిపారు. రేపటిలోగా రైతుల ఖాతాలోనూ ‘రైతు భరోసా’ నిధులు జమ అవుతాయని చెప్పారు. మిగిలిన రూ. 5,400 కోట్లను మరో రెండు విడతలలో విడుదల చేయనున్నట్టుగా తెలిపారు. మరో 20 రోజులలో రూ. 2,700 కోట్లు, ఆ తర్వాత 20 రోజుల్లో మరో రూ. 2,700 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్టుగా చెప్పారు. మొత్తంగా 45 రోజులలో రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో రైతు భరోసా కింద రూ. 9 వేల కోట్లు జమ చేస్తామని తెలిపారు. రైతుల కళ్లలో ఆనందం చూడటమే తమ లక్ష్యమని చెప్పారు.

ఇక, రాష్ట్ర ప్రభఉత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ. 6 వేలు జమ చేస్తుంది. మొత్తంగా మూడు విడతలలో రాష్ట్రంలోని 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ. 9 వేల కోట్లు రైతు భ‌రోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నట్టుగా తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసిన తర్వాత… దరఖాస్తు సమయంలో రైతులు సమర్పించిన మొబైల్ నంబర్లు మెసేజ్‌లు వస్తాయి. తద్వారా రైతులు తమ అకౌంట్లలో రైతు భరోసా నిధులు పడ్డాయో? లేదో? చెక్ చేసుకోవచ్చు. లేకపోతే బ్యాంక్‌ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోవడం ద్వారా కూడా తమ అకౌంట్‌లలో నిధులు జమ అయ్యాయా? లేదా? అనేది తెలుసుకునే వీలు ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *